సబ్బండ వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం

సబ్బండ వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయం
  • జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 
  • బిసిలకు రూ. లక్ష కార్యక్రమాన్ని ప్రారంబించిన ఎమ్మెల్యే 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : సబ్బండ వర్గాల అభివృద్దే ప్రభుత్వ ధ్యేయమని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా  అన్ని వర్గాలను ఆదుకునేందుకు సియం కెసిఆర్ కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని సుమంగళి గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ  దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంక్షేమ సంబరాలలో జెడ్పీ చైర్ పర్సన్ దావవసంత కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీసీ బందు పథకం ద్వారా 13 బీసీ కులాలకు ఒక్కొక్కరికి  రూ లక్ష రూపాయల చొప్పున పథకానికి 13 లభ్దిదారులను ఎంపిక చేసి ఒకరికి రూ. లక్ష చెక్కును అందజేసి పతాకాన్ని ప్రారంబించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం లో 62,000 మందికి పెన్షన్ వస్తే అందులో 49 వేల మంది ఆడబిడ్డలకే వస్తుందని మహిళా బందు, కుల వృత్తుల అభివృద్ధికి పాటుపడుతున్న సియం కేసీఆర్ అని అన్నారు. ఈ  కార్యక్రమంలో , లైబ్రరీ చైర్మెన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్, అదనపు కలెక్టర్ మంద మకరందు, ఆర్డీవో మాధురి, జిల్లా సంక్షేమ అధికారి డా.నరేష్,మున్సిపల్ చైర్మన్లు గోలి శ్రీనివాస్ ,మోర హను మండ్లు,ఎంపీపీలు పాలేపు రాజేంద్రప్రసాద్,కొల జమున శ్రీనివాస్ ,ములాసపులక్ష్మి , లావుడ్యాసంధ్యారాణిసురేందర్ నాయక్, పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ గ,నాయకులు,అధికారులు,ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.