కార్మికునికి కుటుంబానికీ ఆర్థిక సాయం అందించిన మున్సిపల్ చైర్మన్...

కార్మికునికి కుటుంబానికీ ఆర్థిక సాయం అందించిన మున్సిపల్ చైర్మన్...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణం లింగంపేటకు చెందిన  పరిశుద్ధ కార్మికుడు మరణించగా ఆయన కుటుంబానికి మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ రూ.10 వేలు  ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఆయన వెంట కౌన్సిలర్లు బోడ్ల జగదీశ్, పంబల రాము కుమార్, జుంబర్తి రాజ్ కుమార్, సమిండ్ల శ్రీనివాస్, వొద్ది రామ్మోహన్, సిరికొండ రాజయ్య, కమిషనర్ బి.నరేష్ , డీ.ఇ రాజేశ్వర్ ఉన్నారు.