అన్ని వర్గాల అబివృద్ధి ప్రభుత్వ లక్ష్యం  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

అన్ని వర్గాల అబివృద్ధి ప్రభుత్వ లక్ష్యం  ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : అన్ని వర్గాల అబివృద్ధి బిఆర్ఎస్  ప్రభుత్వ లక్ష్యమని  జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ లో బి ఆర్ ఎస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులు పవిత్రంగా ఉపవాస దీక్షలు  కొనసాగిస్తారని అన్నారు. బిఆర్ఎస్  ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, జగిత్యాల నియోజకవర్గం లో మస్జీద్, షాదీఖాన తదితర అభివృద్ధి పనులకోసం  నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థులకు  ప్రభుత్వ హయాంలో మైనారిటీ ఓవర్సీస్ విద్య కోసం 20 లక్షల ఆర్థిక సహాయం ఇస్తున్నామని, మజీద్ లో పని చేసే ఇమామ్, మౌజన్ లకు పింఛన్ అందజేస్తున్నామని, ముస్లిం సోదరులకు రంజాన్ మాసం పురస్కరించుకొని రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్క పేద ముస్లిం లకు ఉచితంగా బట్టలు, విందు ఏర్పాటు చేయటం జరిగింది అని అన్నారు. షాది ముబారక్ ద్వారా రూ. 1,00,116 అందజేస్తున్నమని ,మైనార్టీ గురుకుల విద్యాలయ ల ఏర్పాటు ద్వారా నాణ్యమైన విద్య,వసతులు కల్పిస్తూన్న మన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుల మత తేడా లేకుండా అందరికీ సంక్షేమం,అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్నం అని అన్నారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానం లో ఉందన్నారు. లక్ష్మి పుర్ గ్రామంలో గతంలో ఎన్నడు లేని విధంగా 9 ఎండ్ల లో 24 కోట్ల 49 లక్షల అభివృద్ధి నిధులు కేటాయిఇంచామన్నారు. ముస్లిం కమ్యూనిటీ హల్ నిర్మాణాన్ని రూ. 5 లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.