రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం - కేటీఆర్ చిత్రపటం దహనం

రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం - కేటీఆర్ చిత్రపటం దహనం
  • కోరుట్ల పేట సబ్ స్టేషన్ ఎదుట ధర్నా చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 


ముద్ర, ఎల్లారెడ్డిపేట:పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆదివారం క్షీరాభిషేకం చేసి సబ్ స్టేషన్ ఎదుట కేటీఆర్ చిత్రపటాన్ని దహనం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులను 24 గంటల ఉచిత విద్యుత్ పేరిట తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.  ఏ ఒక్క సబ్ స్టేషన్ పరిధిలో 24 గంటల ఉచిత విద్యుత్తును సరఫరా చేయలేదన్నారు. రైతులందరికీ 12 గంటల వ్యవసాయవిద్యుత్ మాత్రమే సరఫరా చేసినట్టు సబ్ స్టేషన్ లోని రికార్డులు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఏ ఒక్క రోజు కూడా 24 గంటల విద్యుత్తు రైతులకు అందలేదన్నారు.

మొన్నటిదాకా రైతులు కల్లాలలో వడ్లు మొలకెత్తి రైస్ మిల్లర్లు తిరస్కరిస్తే ఏ ఒక్క నాయకుడు రైతులకు ముఖం చూపెట్టలేదన్నారు. ఇప్పటికీ లక్ష రూపాయల రుణమాఫీ కూడా రైతులకు అమలు కాలేదని పేర్కొన్నారు.ఇటువంటి పరిస్థితులలో రైతుల దగ్గరికి    బిఆర్ఎస్  పార్టీ నాయకులు ఏం ముఖం పెట్టుకొని వెళ్తారని ఎద్దేవ చేశారు. వడగండ్ల వాన వలన రైతులు  నష్టపోతే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డి సైన్యం జిల్లా అధ్యక్షుడు తాడ విజయ్ రెడ్డి , సర్పంచ్ దేవానందం, వార్డు సభ్యుడు రవి, నాయకులు కొత్తపల్లి దేవయ్య,గంట బుచ్చగౌడ్,సూడిద రాజేందర్, కోనేటి పోచయ్య ,రమేష్, యువకులు,రైతులు పాల్గొన్నారు.