బిఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు మృతి

బిఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు మృతి

ముద్ర సిరిసిల్ల టౌన్:-తెలంగాణ ఉద్యమకారుడు, బిఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు కొమిరే సంజీవ్ గౌడ్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. సంజీవ్ గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థులు నిరుద్యోగులు యువత ఉద్యోగ, ఉపాధ్యాయులతో కలిసి సిరిసిల్లలో స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రప్రాణి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, టి ఎస్ పిటిడిసి చైర్మన్ గూడూరి ప్రవీణ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నరసయ్య, మండల అధ్యక్షులు వొజ్జాల అగ్గి రాములు, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు కల్లూరి లత మధు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు ఎండి సత్తార్, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, ఎండి మునీర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లూరి మధు, పంగ రవి, దాసరి వీణ మొదలగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సంతాపాన్ని తెలియజేస్తూ మౌనం పాటించారు.