ఘనంగా శ్రీ వీర బ్రహ్మహేంద్రస్వామి కళ్యాణం 

ఘనంగా శ్రీ వీర బ్రహ్మహేంద్రస్వామి కళ్యాణం 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని క్రొత్త బస్టాండ్ చవరస్తా వద్ద గల శ్రీ పోతులూరి వీర బ్రహాంగారి ఆలయంలో సప్తమ వార్షికోత్సవ వేడుకల్లో బాగంగా  శ్రీ గోవిందమంబ సమేత శ్రీ పోతులూరి వీర బ్రహ్మహేంద్ర   స్వామిల వారి కల్యాణము ఘనంగా  నిర్వహించారు. ఉత్సవ మూర్తులు శ్రీ పోతులూరి వీర బ్రహ్మహేంద్ర   స్వామి,  గోవిందమంబలను కళ్యాణా వేదిక వద్దకు తీసుకుని వచ్చి  శ్రీమన్ నంబి వేణుగోపాలచార్య కౌశిక అధ్వర్యంలో వేద బ్రాహ్మణుల మంత్రోత్సవాలు మధ్య సదచారి, లక్ష్మీనరసింహ చార్యులు  స్వామి వార్ల కళ్యాణం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు పాల్గొని స్వామి వారికి ఓడిబియ్యం సమర్పించి భక్తీ శ్రేద్దలతో స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర విశ్వబ్రాహాణ విశ్వకర్మ సంఘము ప్రధాన కార్యదర్శి శ్రీ చోల్లేటి కృష్ణమాచారి, సహాయ కార్యదర్శి సత్యనారాయణ  జిల్లా సంఘము అధ్యక్షుడు టీవీ.సత్యం ,పట్టణ సంఘము అధ్యక్షుడు సంకోజి రమణ, కర్ర సంఘము అధ్యక్షుడు చింతల రాజు, గజోజి నిరంజ్ చారి, శ్రీగదే శ్రీనివాస్, పడకంటి నరహరి, అనడం గజోజి శ్యామ్ , కంబోజి నారాయణ, కొత్తపెళ్లి జెలిందర్, శ్రీ పెళ్లి భూమయ్య, గోపాల్ చారి తదితరులుపాల్గొన్నారు