5 వ రోజుకు చేరిన పంచాయతీ కార్యదర్శుల సమ్మె 

5 వ రోజుకు చేరిన పంచాయతీ కార్యదర్శుల సమ్మె 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె మంగళవారం 5వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మండల కార్యాలయం ముందు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా భారత్ సురక్ష సమితి నాయకులు పంచాయతీ కార్యదర్శుల సమ్మె కు మద్దతు పలికి దిక్షాలో పాల్గొని మాట్లాడుతూ  వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రొబేషనరీ కాలం పూర్తి చేసుకున్న రెగ్యులర్ చేయకపోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం  వెంటనే రేగ్యులర్ చేస్తూ జి.ఓ. విడుదల చేయాలని, గడిచిన 4 ఏళ్ల కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలని, జి.  ఓ.పి.ఎస్. లను కూడా రేగ్యులర్ చేయాలని,  రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతి కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించి ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరణించిన జూనియర్ పంచాయతి కార్యదర్ముల కుటుంబాలకు కారుణ్య నియా మకాలు చేపట్టాలని కోరారు. అర్హులైన సీనియర్ పంచాయతి కార్యదర్శు లకు ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోభారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.సి.ఎస్. రాజు, అక్కినపల్లి కాశీనాథం రాష్ట్ర సీనియర్ నాయకులు ఎలగందుల చంద్రశేఖర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కినపెల్లి కాశీనాథo, సీనియర్ నాయకులు చందా సుగునకర్ రావు, గండ్ర ప్రవీణ్ రావు, షీలా గంగారాం, వనమాల సత్యనారాయణ, బండి సత్యనారాయణ, తూనికి అంజన్న, కొలుగురి ప్రసాద్ రావు, నరెందుల శ్రీనివాస్, బొందుకురి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు,   పాల్గొన్నారు.