అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  బ్లాక్ డే 

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని  బ్లాక్ డే 
  • నల్ల చీరలు ధరించి కలెక్టరేట్ ఎదుట ధర్నా 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జగిత్యాల జిల్లాలో అంగన్వాడి కార్యకర్తులు సోమవారం బ్లాక్ డే నిర్వహించారు. ఈ సదర్బంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తలు నల్ల చీరలు ధరించి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ముందు బయటయించి ధర్నా చేశారు.

ఈసందర్భంగా అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు రజిత, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముత్యం రావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం నెలకు రూ. 26 వేలు  నిర్ణయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచి అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లు గా గుర్తించాలని కోరారు. అంగన్వాడీ టీచర్స్ , హెల్ప ర్స్ సమస్యలను పరిష్కరించాలని లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపడతామని  హెచ్చరించారు. జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు.