కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేకే మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో

ముద్ర, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కేకే మహేందర్రెడ్డి 61వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి చిత్రపటం ఎదుట కేక్ కట్ చేశారు. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.మంచి పదవిలో ఉంటూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, నాయకులు మల్లారెడ్డి, గంటబుచ్చాగౌడ్, కొత్తపల్లి దేవయ్య, పందిర్ల శ్రీనివాస్, పరశురాములు, ప్రశాంత్, తిరుపతి గౌడ్, రాజేందర్, నరేందర్, రాంరెడ్డి, రఫిక్,సంతోష్ గౌడ్,లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.