తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి 

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి 

ముద్ర,నంగునూరు:తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు నైజాం తూటాలకు నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని నంగునూరు మండల కురుమ సంఘం అధ్యక్షులు బెదురు తిరుపతి ఎంపీటీసీ అన్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమరయ్య 77వ వర్ధంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ నిజాం నిరంకుశ వెట్టి చాకిరి పాలనకు వ్యతిరెకంగా పోరాడి తుపాకీ గుండు కు నెలకోరిగిన ఉద్యమకారుడు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య  77వ వర్థoతి ఈరోజు సిద్దన్నపేట ఎక్స్ రోడ్డు నంగునూరు మండల కురుమ సంఘం అధ్యక్షులు బెదురు తిరుపతి ఎంపీటీసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు బెదురు మల్లేశం,నకిర్త రాజమల్లు,బెదురు నర్సింలు, కొన్నే రాములు, బెదురు కైలాస్,బట్ట కనకవ్వ, ఏట్ల సాయి, బెదురు అనిల్, తడకపల్లి రాజు, తడకపల్లి ప్రశాంత్, ఓరిగంటి సంపత్, తదితరులు పాల్గొన్నారు.