ఫర్టిలైజర్, సీడ్స్ షాపులలో పోలీసుల తనిఖీలు

ఫర్టిలైజర్, సీడ్స్ షాపులలో పోలీసుల తనిఖీలు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : పోలీస్ కమిషనర్  ఆదేశానుసారం గజ్వేల్ పట్టణంలో ఉన్న సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపులలో గజ్వేల్ ఏసీబీ రమేష్, గజ్వేల్ సిఐ వీరా ప్రసాద్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు.గురువారం  చేపట్టిన తనిఖీలలో ఎలాంటి నకిలీ విత్తనాలు,నకిలీ పురుగుల మందులు లభించలేదు.

ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి రమేష్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు,నకిలీ పురుగు మందులు అమ్మి రైతులను మోసం చేయాలని చూసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
తరచుగా షాపులను తనిఖీ చేయడం జరుగుతుందని, రైతులను మోసం చేయాలని చూసే షాపు యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సహాయ సహకారాలతో విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. గ్రామాలలో తిరుగుతూ అమ్మే  విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దని, విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.

నకిలీ విత్తనాలు అమ్మే షాపు యజమానులపై, వ్యక్తుల పై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు ఉన్నట్లు మరియు ఎవరైనా అమ్ముతున్నట్లు సమాచారం వస్తే  వెంటనే  డయల్ 100 లేద సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 8712667100 కు సమాచారం అందించాలని కోరారు.