ఘనంగా సుందర సత్సంగం 30వ వార్షికోత్సవాలు

ఘనంగా సుందర సత్సంగం 30వ వార్షికోత్సవాలు

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిద్దిపేట లోని సుందర సత్సంగం భవనంలో వెలసిన మురళీకృష్ణుడికి శుక్రవారం రోజున అభిషేకాలు,అర్చనలు ఘనంగా పూజలు నిర్వహించారు సుందర సత్సంగం 30వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరిపారు.ప్రత్యేకమైన అలంకరణలతో అనంతరం భక్తులకు మురళీకృష్ణుడు దర్శనమిచ్చారు. సత్సంగ నిర్వాహకులు బచ్చు రమేష్ మాట్లాడుతూ స్వామి సుందర చైతన్యానందులచే రాష్ట్రంలోనే మొట్టమొదటి సుందర సత్సంగం సిద్దిపేటలో ఏర్పాటై  30 ఏళ్లు గడిచిందన్నారు.

ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ముందుకు తీసుకు వెళ్తూ స్వామి సుందర చైతన్యానందుల లక్ష్యం మేరకు కృషి చేస్తున్నామని,యావత్ ప్రపంచానికి మురళీకృష్ణుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సత్సంగం సభ్యులు అయిత కేదారినాథ్, అమెరిశెట్టి బాలరాజ్, పారిపల్లి గంగారాం, కోర్తివాడ నర్సయ్య, అత్తెల్లి ప్రసాద్, తిరుపతి, వెంకటేష్, జగదీశ్వర్, విజయ్ కుమార్, అత్తెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.