తెలంగాణ సంస్కృతి భవితకు పునాది

తెలంగాణ సంస్కృతి భవితకు పునాది

సిద్దిపేట : ముద్ర ప్రతినిధి తెలంగాణలో ఉన్న  శ్రమైక జీవన సౌందర్యం,  అద్భుతమైన సంస్కృతి భావితరాలకు పునాదిగా మారుతుందని వక్తలు  చెప్పారు.వ్యాస మహర్షి  యోగ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సిద్దిపేట విపంచి కళానిలయంలో బాల సంస్కార్ ముగింపు  ఉత్సవం జరిగింది.ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మంజుల  రాజనర్సు ,రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ డైరెక్టర్ పాల సాయిరాం,  సుడా డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి,  సిద్దిపేట జిల్లా టీఎన్జీవోల సంఘం

 అధ్యక్షులు గ్యాదరి  పరమేశ్వర్ ,రాష్ట్ర  ప్రెస్ కౌన్సిల్  పూర్వ సభ్యులు కొమరవెల్లి అంజయ్య,సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్ ,టిపియుఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి లు మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగిపోతున్న నేపథ్యంలో రేపటి  తెలంగాణ పౌరులను అవాంఛనీయ సంస్కృతి నుంచి రక్షించి వారికి సంస్కారం,  సంస్కృతి , పండుగలు,ఆరోగ్యం, మానవ విలువలు, పురాణాలు,  సంగీతం,నాట్యం,  చిత్రలేఖనం మొదలగు అంశాల్లో శిక్షణ ఇవ్వడం వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు .

రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఆరోగ్య తెలంగాణ లక్ష్యం నెరవేరడానికి ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగ  పరిషత్ సభ్యులు , యోగ శిక్షకులు తోట సతీష్ , కోర్స్ డైరెక్టర్ తోట సంధ్య , వ్యాస మహర్షి యోగా సొసైటీ  జిల్లా అధ్యక్షులు నిమ్మ శ్రీనివాసరెడ్డి , శిక్షకులు యాదగిరి , శశిధర శర్మ,  రవి , రాజేష్,  ఉమామహేశ్వరి,  పూజ,  మనీషా ,సాయి , సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు, కోలాటాలు ,సాంప్రదాయ నృత్యాలు లపై  ఆహుతుల చప్పట్లు కురిపించారు.