సరస్వతీ కటాక్ష పుత్రుడు సిద్ధప్ప కవి - కోహెడ ఎంపీపీ  కీర్తి సురేష్

సరస్వతీ కటాక్ష పుత్రుడు సిద్ధప్ప కవి - కోహెడ ఎంపీపీ  కీర్తి సురేష్

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:సిద్దిపేట సరస్వతి దేవి కటాక్ష పుత్రుడు వరకవి సిద్ధప్ప అని కోహెడ మండల పరిషత్ అధ్యక్షురాలు కొక్కుల కీర్తి సురేష్ కొనియాడారు.ఆదివారం నాడు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో తెలంగాణ వేమనగా ప్రసిద్ధికెక్కిన అనంతవరం సిద్ధప్ప వరకవి 120 వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

గ్రామ సర్పంచి ఓరిగంటి అశోక్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యురాలు సుతారి కళ్యాణి కనకయ్యతో కలిసి సిద్ధప్ప ఆశ్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించగా అక్కడ చిత్రపటానికి పూలమాలవేసి స్మరించుకున్నారు.  అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మారుమూల గ్రామం నుంచి ఎదిగిన సిద్ధప్ప గోల్కొండ కవిగా, తెలంగాణ వేమనగా ప్రసిద్ధిగాంచారని కొనియాడారు.సిద్ధప్ప రచనలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఆయన రచనలు ఉన్నాయన్నారు. సిద్ధప్ప ఆశ్రమాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సిద్దప్ప కుమారుడు మాణిక్యలింగం, ఉపసర్పంచి రాములు, పంచాయతీ కోఆప్షన్ సభ్యులు సంజీవరెడ్డి, కనకయ్య, ఉపాధ్యాయుడు సత్యనారాయణ, భారాసనాయకులు పాము శ్రీకాంత్, కుమారస్వామి,కిషన్, యాదగిరి,కోటేశ్వర్,  కాంగ్రెస్ నాయకుడు అజ్జుయాదవ్, బాలవికాస సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.