రిజర్వ్ ఇన్స్పెక్టర్లను అభినందించిన  సిపి

రిజర్వ్ ఇన్స్పెక్టర్లను అభినందించిన  సిపి

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐలకు (ఆర్ఐ) రిజర్వ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన అధికారులను పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అభినందించారు.

రిజర్వ్ ఇన్స్పెక్టర్లుగా  పదోన్నతి పొందిన 2014 బ్యాచ్ అధికారులు డి.కార్తీక్,   యు.తిరుపతి సోమ వారం నాడు పోలీసు కమిషనర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సిపిని కలసి మొక్కలు అందజేశారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారుల భుజాలపై ఇన్స్ స్పెక్టర్ చిన్నహం అయిన మూడవ నక్షత్రాలను అలంకరించడంతో పాటు,వారిని అభినందించారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్లను అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీలు  రాంచందర్రావు, సుభాష్ చంద్రబోస్  ప్రమోషన్ పొందిన అభినందించారు.