కాంగ్రెసు బీసీ డిక్లరేషన్ తయారీ కోసం రాష్ట్ర పర్యటన

కాంగ్రెసు బీసీ డిక్లరేషన్ తయారీ కోసం రాష్ట్ర పర్యటన
  • 33 జిల్లాల్లో బీసీ శ్రేణులను కలుస్తాం
  • తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే
  • సిద్దిపేట బీసీ సభలో పీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
  • కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ ఎల్ సూర్యచంద్ర వర్మ అధ్యక్షతన ఈ సభ జరిగింది

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ తయారీ కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పర్యటించి ఆయా వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నామని పిసిసి ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. సిద్దిపేటలో సోమవారం జరిగిన కాంగ్రెస్ బీసీ సెల్ డిక్లరేషన్ సన్నహాక సమావేశానికి శ్రీకాంత్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు అంతకుముందు పాత బస్టాండ్ వద్ద భారతరత్న ,అంబేడ్కర్ హాత్మ జ్యోతిబాపూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాత బస్టాండ్ నుంచి విక్టరీ టాకీస్ ముస్తాబాద్ చౌరస్తా వరకు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ ఇప్పటికే వరంగల్లో రైతు డిక్లరేషన్ హైదరాబాదులో యూత్ డిక్లరేషన్లు ప్రకటించిందని తెలిపారు బీసీల డిక్లరేషన్ కోసం తాను పట్టు పట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి పార్టీ అధిష్టానానికి నివేదిస్తారు అన్నారు జూలై 10 లోపు అన్ని జిల్లాల్లో బీసీ డిక్లరేషన్ సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు గ్రామ స్థాయి నుంచి వచ్చిన సలహాలు సూచనలు పాటించి బీసీ డిక్లరేషన్ పెద్ద ఎత్తున ప్రకటిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు తూముకుంట నరసారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సొంత గ్రామానికి ప్రత్యేక నిధులు ఇచ్చి రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ లేదన్న వారికి ఈరోజు సమావేశమే నిదర్శనం అని చెప్పారు మద్దూరు జెడ్పిటిసి సభ్యుడు గిరికొండ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం రావడం ఖాయం అన్నారు ఈ  సమావేశంలో పిసిసి కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హత్తు ఇమామ్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు గంప మహేందర్ రావు, చొప్పదండి చంద్రశేఖర్, బొమ్మల యాదగిరి, దరిపల్లి చంద్రం, సతీష్, కలిముద్దీన్, బాలకృష్ణారెడ్డి, లక్కరాసు ప్రభాకర్ వర్మ , ముద్దం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముందుగా నూతి శ్రీకాంత్ గౌడ్ గౌడ కులస్తులు కులవృత్తికి వాడే మోకును మెడలో వేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ముస్లింలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ ఎల్ సూర్యచంద్ర వర్మ అధ్యక్షతన ఈ సభ జరిగింది