దైవ కృప తోటే తెలంగాణ సస్యశ్యామలం

దైవ కృప తోటే తెలంగాణ సస్యశ్యామలం
  • భక్తి,విశ్వాసాలతో భగవంతుని కొలిచే వ్యక్తి కెసిఆర్ 
  •  తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
  • ధూప దీప నైవేద్యంతో దేవునికి తృప్తి, అర్చకులకు భుక్తి
  • ఆధ్యాత్మిక దినోత్సవం వేడుకలలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేవుడంటే అంటే అపారమైన భక్తి అని, అర్చకులు అంటే అమితమైన గౌరవం అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సిద్దిపేటలో జరిగిన ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకలలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు.

దైవ కృప వల్లనే తెలంగాణ తొమ్మిదేళ్లుగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణలో ఉన్న పురాతన ఆలయాలకు గ్రామీణ ఆలయాలకు గుర్తించి ముఖ్యమంత్రి ధూప దీప నైవేద్య స్కీముకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించారని చెప్పారు.ఈ పథకం వల్ల దేవుడికి నిత్యము ధూప దీప నైవేద్యం అందడంతో తృప్తి పొందుతున్నాడని ఫలితంగా ఆలయాలు పనిచేసే అర్చకులకు బుక్తి లభించిందని చెప్పారు.రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటినీ పునరుద్ధరణ చేయడం ద్వారా ముఖ్య మంత్రి ఆలయాలకు పెద్దపీట వేశారని చెప్పారు.

ఇంత చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని భగవంతుడు ఎల్లకాలం దీవించేలా అర్చకులు ఆలయాల్లో నిత్య పూజలో గుర్తు చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ధూప దీప నైవేద్య పథకం కింద కొత్తగా మంజూరైన ఆలయాలకు సంబంధించిన ప్రోసిడింగులను అర్చకులకు అందజేశారు కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్ ఈవో విశ్వనాధ శర్మ సిద్దిపేట ప్రజా ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు