6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం

6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం

పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్ అనిల్ కుమార్ తో సిద్దిపేట జిల్లా యంత్రాంగం భేటీ.

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలో 2022- 2023 సంవత్సరంలో 416 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి తగిన ప్రణాళిక సిద్ధం చేసినట్లు జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. గురువారము సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనంలో జరిగిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ హాజరైనారు.

సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతారెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మ రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ హరీష్ తదితరులు అనిల్ కుమార్ కు స్వాగతం పలికారు. జిల్లాలో రైతుల కు పంట చేతికి రాంగనే గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ధాన్యాన్ని సేకరించేందుకు జిల్లా పౌరసరఫరాల శాఖ తగిన ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర అధికారి అనిల్ కుమార్ కు జిల్లా అధికారులు తెలిపారు.