మనఊరు మనబడి పథకంపై కలెక్టర్ సమీక్ష

మనఊరు మనబడి పథకంపై కలెక్టర్ సమీక్ష

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలోని జనగాం నియోజకవర్గంలో జరుగుతున్న మనఊరు మనబడి పథకంపైన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ సమీక్ష సమావేశం 
నిర్వహించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని మీటింగ్ హల్ లో జరిగిన ఈ సమావేశానికి జనగాం నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, దుళ్మీట్ట, మద్దూరు, కొమురవెల్లి మండలాల 
పాఠశాలల వారిగా ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్లు, ఎంఈవోలు,ఎంపిఓలు ఎంపిడిఒలు,ఎపిఓలు, ఇంజినీరింగ్ విభాగం ఏఈ,డిఈలు, సర్పంచిలు,నిర్మాణ ఏజెన్సీల నిర్వాహకులు హాజరయ్యారు
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.

 పాఠశాలలకు సెలవులు ఉన్నందున ఈ 30,40 రోజుల్లో, వర్కింగ్ సిజన్లో వేగంగా పనులను పూర్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ పథకంలో ఎలక్ట్రిసిటీ,తాగునీటి వసతి,మేజర్ మైనర్ కిటికీలు,డోర్లు,స్లాప్, ఫ్లోర్ రిపేర్లు తప్పని సరిగా పూర్తిచేసి కలరింగ్ కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్ఆర్ఈజిఎస్, ఈజీఎస్ కింద చేసే పనుల్లో మరుగుదొడ్లు, కిచెన్ షేడ్ పూర్తి చేశాకే మిగతా ప్రహరీగోడ, అదనపు తరగతి గదులు పూర్తి చెయ్యాలని,ఈ పనులు నత్తనడకన సాగుతున్నందున కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. 

ఈజిఎస్ పనుల్లో చాలా వెనకబడి ఉన్నందున ఈ మండలాల్లో పాఠశాలల పనులను పర్యవేక్షణ చెయ్యాలని డిఈ,ఎంపిడిఒ, ఎంపిఓలను ఆదేశించారు. పాఠశాలల్లో సేవింగ్స్ ఉంటే సుందరీకరణ పనులు చేయ్యాలని అందులో స్టీల్ అక్షరాలతో పాఠశాల బోర్డు తప్పనిసరిగా చేయించాలన్నారు.పెద్ద గేట్ పైన ఆర్చ్,మెట్లకు గ్రానైట్, స్టేజ్ పక్కన గ్రానైట్, గడ్డి కార్పైట్, ఇతర పనులను చెయ్యాలని ఎంఈఓ, ఎచ్ఎం,ఎఈలకు సూచించారు.ఎప్పటి పనులకు అప్పుడు ఎప్టిఓ జనరేట్ చేసి కలరింగ్ ఏజెన్సీకి మెజర్మెంట్ షిట్ ను అందించాలని ఎఈ లకు సూచించారు. కోన్ని పాఠశాలల్లో కిటికి డ్రిల్స్ పెద్దగా ఉన్నందున కోతులు లోపలికి వచ్చి వైరింగ్, చార్జర్లను పాడుచేస్తున్నాయని ఎచ్ ఎంలు తెలుపగా కిటికీలకు ఇనుప జాలి ఏర్పాటు చెయ్యాలని ఏఈలకు తెలిపారు. మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.