జిల్లాలో 749 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు

జిల్లాలో 749 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు

87,692 మంది రైతుల నుంచి 3,63,806 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

రూ.688 కోట్లు రైతుల ఖాతాలో జమ,రూ.60 కోట్లు డ్యూ

'ముద్ర ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ లో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ 
జె హరీష్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట :జిల్లాలో 740 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశామని  పౌరసరఫరాల సంస్థ సిద్దిపేట జిల్లా మేనేజర్ జి హరీష్ తెలిపారు. ఆయన 'ముద్ర ప్రతినిధి' కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్ లో  రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు పూర్తయిందని చెప్పారు.జిల్లాలో 416 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 87,692 మంది రైతుల నుంచి   3,63,806 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు.జిల్లాలో ఐకెపి( మహిళా సంఘాల ద్వారా) కొనుగోలు కేంద్రాల ద్వారా 1,88,717 మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పిఎసిఎస్ లు) ద్వారా 1,68,559 మెట్రిక్ టన్నులు, మెప్మా ద్వారా 5,760 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి జిల్లాలో ఉన్న రైస్ మిల్లులకు సరఫరా చేశామని హరీష్ వివరించారు. మొత్తం మీద 749 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి ఇప్పటికే 688 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.మరో 60 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. వాటిని కూడా త్వరలోనే అకౌంట్లో జమ చేస్తామన్నారు. గత సీజన్ కంటే ఈ సీజన్లో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యము తక్కువగా కొనుగోలు చేసినట్లు డిఎం హరీష్ తెలిపారు.