ఆరోగ్య తెలంగాణ కై యోగా చేద్దాం- మంత్రి హరీష్ రావు పిలుపు

ఆరోగ్య తెలంగాణ కై యోగా చేద్దాం- మంత్రి హరీష్ రావు పిలుపు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: ఆరోగ్య తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం నాడు సిద్దిపేటలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్,వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము నిర్వహించగా జిల్లా నలుమూలల నుంచి యోగ సాధకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు తో పాటు ఎమ్మెల్సీ కూర రగోతంరెడ్డి తదితరులు కొద్దిసేపు యోగాసనాలు వేశారు. ధ్యానం చేశారు. మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా యోగా లో నిష్ణాతులైన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఇందిరానగర్ జెడ్ పి హైస్కూల్ విద్యార్థులు ఈ సందర్భంగా చేసిన యోగాసనాలు అందరిని ఆకట్టుకున్నాయి.

మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ అంటే ఆసుపత్రులను నిర్మించడం కాదని ఆసుపత్రులు లేని ఆరోగ్య తెలంగాణను సాధించడమేనన్నారు. ఇంకా బయట యోగ ప్రాముఖ్యతను అందరికీ తెలియ ప్రతిరోజు దాన్ని దినచర్యలో భాగస్వామ్యం చేసుకొని ముందుకు వెళ్లాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు మంజుల రాజనర్సు కార్యక్రమ నిర్వాహకులు తోట సతీష్, కొమురవెల్లి అంజయ్య, తోట అశోక్, ఉపాధ్యాయ సంఘాల నేతలు, పట్టణ కౌన్సిలర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.