సిద్దిపేట జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు

సిద్దిపేట జిల్లాలో ఘనంగా బక్రీద్ వేడుకలు
  • మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు

ముద్ర ప్రతినిధి :సిద్దిపేట:మతసామరస్యానికి ప్రతీక బక్రీద్ అని పలువురు నేతలు చెప్పారు. బక్రీద్ సందర్భంగా గురువారం నాడు జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఆనంద ఉత్సవాలతో వేడుకలు జరుపుకున్నారు. ఈద్గాల వద్ద, మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ముస్లింలకు హిందువులు,స్థానిక ప్రజాప్రతినిధులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలోని సోఫియా మసీద్ ,గద్ద బొమ్మ, ఈద్గాల వద్ద ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్,మాజీ మున్సిపల్ చైర్ మెన్ కడవెరుగు రాజనర్సు, పలువురు పట్టణ వార్డు కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ దుబ్బాక హుస్నాబాద్ తదితర ప్రాంతాల్లోనూ బక్రీద్ వేడుకలు ఆనందోత్సవాల మధ్య ముస్లింలు నిర్వహించుకున్నారు.