ఎంపీడీఓకు సమ్మె నోటీసు ఇచ్చిన గ్రామ పంచాయతి కార్మికులు

ఎంపీడీఓకు సమ్మె నోటీసు ఇచ్చిన గ్రామ పంచాయతి కార్మికులు

దుబ్బాక,ముద్ర: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం చేయాలనీ కోరుతూ జులై 6 వ తేదీ నుండి సమ్మె చేస్తున్నామని ఎంపీడీఓకు సమ్మె నోటీసు ఇచ్చారు.అనంతరం  సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు, స్వీపర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు, తదితర కేటగిరిలలో నర్సరీలు, వైకుంఠదామం, అఫీస్ నిర్వహణలో విధులు నిర్వహిస్తున్నా వారందరూ గత 20-30 సంవత్సరాలుగా పనులు చేస్తున్నప్పటికీ పంచాయతీ సిబ్బంది పర్మినెంట్,పనికి గుర్తింపు,పని భద్రత, కనీస వేతనాలు, పి.ఎఫ్. ఇ.ఎస్.ఐ. ప్రమాద బీమా లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని విమర్శించారు.గ్రామ పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలని,పి.ఆర్.సి లో నిర్ణయించిన బేసిక్ ప్రకారం పంచాయతీ సిబ్బందికి  19 వేల రూపాయలు చెల్లించాలని,ఆ లోపు జీ.వో. నెం.60లో పేర్కొన్న వేతనాలను కేటాగిరీల వారీగా పంచాయితీ సిబ్బందికి నెలకు 15,600 రూపాయలు కారోబార్, బిల్ కలెక్టర్లకు, ఇతర స్కిల్డ్ సిబ్బందికి, 19,500 రూపాయలు చెల్లించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు, అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమేషన్ ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే వివిధ కేటగిరీలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ,కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సమ్మె కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ కొంపల్లి భాస్కర్, గ్రామ పంచాయతీ కార్మికులు శ్రీనివాస్,రవి,ప్రశాంత్, కనకయ్య,చెంద్రయ్య,రాజయ్య, ఏళ్ళయ్యా, పెంటయ్య,లచ్చవ్వ, యాదవ్వ,దుర్గవ్వ, తదితరులు పాల్గొన్నారు.