మార్కెట్లో బగ్గుమన్న కూరగాయల రేట్లు 

మార్కెట్లో బగ్గుమన్న కూరగాయల రేట్లు 

ఒక్క వర్షంతో  కిలో 40 రూపాయలకు ఎగబాకిన టమాటా ధర , కిలో 80 రూపాయలైనా సన్నమిర్చి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: రైతు బజార్ లో కూరగాయల రేట్లు బగ్గుమన్నాయి. వర్షం పడడంతోనే టమాటా, పచ్చి మిర్చి ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు 10 రూపాయలకు కిలో టమాటాలు శనివారం నాడు అమాంతం 40 రూపాయలకు కిలో అయ్యాయి. 50 రూపాయలు ఉన్న సన్నమిర్చి ధర 80 రూపాయలకు ఎగబాకింది. వర్షాలు అధికంగా కురిస్తే టమాట, మిర్చి తోటలు ధ్వంసమై సరుకు కొరత ఏర్పడుతుంది.నేల మీద కాసే టమాటాలు మురీగిపోవడం,మిర్చి దిగుబడి తగ్గడం జరుగుతుందని రైతులు చెబుతున్నారు.

ఈ క్రమంలో  టమాట పంట దిగుబడి తగ్గుతుంది. అప్పుడు టమాట కొనడానికి మార్కెట్లో షాటేజ్ ఉంటుంది కాబట్టి టమాట ధరలు పెరుగుతాయి. కానీ దీనికి విరుద్ధంగా శుక్రవారం నాడు కురిసిన చిరుజల్లుకే ఆదివారం నుంచి టమాటా రేట్లు అమాంతం రైతులు పెంచేశారు. మార్కెట్లో కూరగాయల కొనుగోలుకు వచ్చిన రైతులకు పెరిగిన టమాటా ధర చూసి మొదట అవాక్కైనా తప్పనిసరి కొనుగోలు చేసి తీసుకెళ్లారు.

నిత్యం కూరల్లో వాడే సన్నమిర్చి రేట్లను కూడా అమాంతం పెంచినప్పటికీ తప్పనిసరి రావడంతో వినియోగదారులు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. టమాట కిలో ధర 40 కాగా, వంకాయ కిలో ధర 30, నల్ల వంకాయ కిలో ధర 24, బెండకాయ కిలో ధర 30 ,సన్నమిర్చి కిలో ధర 80, దొడ్డు మిర్చి కిలో ధర 64, కాకరకాయ నల్లది 60, కిలో తెల్లది 64,  బీరకాయ కిలో 60 రూపాయలు, క్యాబేజీ కిలో 20 రూపాయలు, దొండకాయ కిలో 32 రూపాయలు ,క్యారెట్ కిలో 44 రూపాయలు, బీర్నిసి కిలో 100, మామిడి పండ్లు కిలో 30, ఆలుగడ్డ కిలో 20, ఉల్లిగడ్డ కిలో 25 ,ఎర్ర ఉల్లిగడ్డ కిలో 17, చిక్కుడు కిలో 70, గోరుచిక్కుడు కిలో 54, పాపిడి చిక్కుడు కిలో 70 రూపాయలు, చామగడ్డ కిలో 40 రూపాయలు, బుడుమకాయ కిలో 20 రూపాయలు, దోసకాయ కిలో 40 రూపాయలు ,కీరదోస కిలో 30 రూపాయలు, బీట్రూట్ కిలో 32 రూపాయలు, అల్లం కిలో 160, లోకల్ అల్లం కిలో 180 రూపాయలు ,ఎల్లిగడ్డ కిలో 100 రూపాయలు, చింతపండు కిలో 60 రూపాయలు, క్యాప్సికం కిలో 50 రూపాయలు, పాలీహౌస్ కీర కిలో 30 రూపాయలు, కండ్రగడ్డ కిలో 20 రూపాయలు,పల్లి  కాయ కిలో 44 రూపాయల చొప్పున రైతు బజార్లో విక్రయిస్తున్నారు.