ఆశపడి,మోసపోకండి...అప్రమత్తంగా ఉండండి..

ఆశపడి,మోసపోకండి...అప్రమత్తంగా ఉండండి..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: లోన్అప్, లాటరి, పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేరుతో మెసేజ్ రాగానే ఆశపడి మోసపోవద్దని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మాహాజన్  ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్  మాహాజన్ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారని అన్నారు.

నకిలీ లాటరీలు, ఉద్యోగ ప్రకటనలు,  బ్యాంకు అకౌంట్ సమాచారం, నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్ ,పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోవద్దని, ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ అన్నారు.ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేయాలని,   తద్వారా పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చుఅని అన్నారు.