చల్మెడ వర్సెస్ చెన్నమనేని..

చల్మెడ వర్సెస్ చెన్నమనేని..
  • వేములవాడ బీఆర్ఎస్ లో కొనసాగుతున్న వర్గ విబేదాలు
  • బీఆర్ఎస్ వాట్సప్ గ్రూపు నుంచి చల్మెడ వర్గీయుల రీమూవ్
  • చందుర్తి మండలంలో భగ్గుమంటున్న బీఆర్ఎస్ నేతలు
  • మండలాధ్యక్షుడికి సంబంధం లేకుండా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రీమూవ్
  • ప్రెస్మీట్ పెట్టెందుకు సిద్దమవుతున్న ఎమ్మెల్యే వ్యతిరేఖ వర్గం 

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు బీఆర్ఎస్ టికెట్ ఆశీస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహారావు మధ్య వర్గ విబేదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి వేములవాడ రాజకీయాలు చల్మెడ వర్సెస్ చెన్నమనేనిగా మారాయి. వేములవాడ నియోజకవర్గంలో చల్మెడలకు మద్దుతగా ఉంటున్న బీఆర్ఎస్ నేతల పై ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు వర్గం చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. ఈ నేఫధ్యంలోనే చందుర్తి మండలం లింగంపేట ఎంపీటీసీ పెంగెర్ల రమేశ్​ రావు, గ్రామశాఖ అధ్యక్షులు చలివేరి రవిని బీఆర్ఎస్ వాట్సప్ గ్రూపు నుంచి అర్ధరాత్రి ఎవరికి సమాచారం లేకుండా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒకరు తొలగించారు. వాట్సప్ నుంచి బీఆర్ఎస్ నేతల రీమూవ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఆదేశాల మేరకు తీసేశారా..లేక .. కార్యాలయ సిబ్బందే తొలగించారా తెలియాల్సి ఉంది.

లింగంపేట ఎంపీటీసీ రమేశ్ బాబు ముద్రకు ఫోన్ చేసి మాట్లాడారు. చందుర్తి బీఆర్ఎస్ గ్రూపులో సిఎం కూతరు ఎంఎల్సీ కవితక్క, మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన వివరాలు పోస్టు చేసినందుకు తమను రీమూవ్ చేశారని పేర్కొన్నారు. తాము చల్మెడ లక్ష్మీనరసింహర రావుకు మద్దతు పలుకుతున్నందుకే అధికారిక బీఆర్ఎస్ మండల వాట్సప్ గ్రూపు నుంచి తొలగించాలరని వాపోయారు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చిన తాము పని చేస్తామని, బీఆర్ఎస్ కు తాము విదేయులమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తాము పార్టీ కోసం పని చేస్తామన్నారు. వాట్సప్ నుంచి ఎందుకు రీమూవ్ చేశారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందికి కాల్ చేసిన సమాధానం లేదని, చందుర్తి మండల బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మ్యాకల ఎల్లయ్యకు కాల్ చేసిన తనకు సంబంధం లేదని పేర్కొంటున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే రమేశ్ బాబు తమపై క్షక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. తాము బీఆర్ఎస్ పార్టీలో ఏం తప్పు చేశామో చెప్పాలని..లేకుంటే వారు చేస్తున్న తప్పులు ప్రెస్మీట్ పెట్టి ప్రకటిస్తామన్నారు.

ఐన పార్టీకి నష్టం జరుగుతదని ఓపిక పడుతున్నమన్నారు. చందుర్తి మండల బీఆర్ఎస్ లో చాలా మంది నాయకులు, కార్యకర్తలు మానసిక క్షోభను అనుభవిస్తున్నరన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదిలా ఉండగా.. జూలై 5న చల్మెడ లక్ష్మీనరసింహా రావు లింగంపేట పర్యటన చేసి ఓ గల్ప్ బాధిత కుటుంబాన్ని పరార్శించారు. ఈ పరామర్శలో చల్మెడ వెంట ఎంపీటీసీ రమేశ్​ రావు ఉన్న నేపధ్యంలో వాట్సప్ గ్రూపు నుంచి తొలగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైన వేములవాడ నియోజకవర్గం వాట్సప్ గ్రూపు వ్యవహారం రాజకీయంగా ఎక్కడిదాక వెళ్తుందో వేచి చూడాలి..

నియోజకవర్గంలో చల్మెడ పర్యటనలు విస్తృతం..
చెక్ పెట్టెందుకు చెన్నమనేని వర్గీయుల స్కెచ్

వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ ఆశీస్తున్న చల్మెడ విద్యా సంస్థల అధినేత చల్మెడ లక్ష్మీనరసింహారావు అనుహ్యంగా వేములవాడ తెరపైకి వచ్చి రాజకీయంగా విస్తృత చర్చకు దారి తీశారు. మంత్రి కేటీఆర్ కూడా చల్మెడకు పరోక్షంగా మద్దతు పలకడంతో వేములవాడ నియోజకవర్గంలో కార్యాలయం ఓపినింగ్, మండలాల వారిగా మెడికల్ క్యాంపులు, సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యటనలు చేస్తున్నారు. మండలాల వారిగా బీఆర్ఎస్ నాయకుల మద్దతు కూడాగట్టెందుకు తన వర్గంతో తెరవెనక ప్రయత్నాలు.. రహస్య సమావేశాలు ప్రారంభించారు. బీఆర్ఎస్ టికెట్ ఎవరికి ఇచ్చిన పని చేస్తాను అంటూనే..బీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని.. నియోజకవర్గంలో పరోక్షంగా హింట్ ఇస్తూ.. దూసుకుపోతున్నాడు. తనకు మద్దతు పలుకుతున్న బీఆర్ఎస్ నేతలకు అండగా ఉంటున్నాడు. వేములవాడ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు.. ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ కు చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.