సిరిసిల్ల పట్టణం- 19వ వార్డ్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

సిరిసిల్ల పట్టణం- 19వ వార్డ్ లో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ముద్ర సిరిసిల్ల టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పేదింటి ఆడబిడ్డల పెళ్లికానుక కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సహకారంతో పట్టణం లోని 19 వ వార్డ్ లో స్థానిక కౌన్సిలర్ అన్నారం శ్రీనివాస్ లబ్దిదారులు బొమ్మెన జ్యోతి, వడ్లకొండ లలిత లకు 1,00,116 రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కును వారి ఇంటికి వెళ్ళి అందచేశారు. ఇట్టి చెక్కు పొందిన లబ్ధిదారులు ఎంతో సంతోషంతో తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కెటిఆర్ కి ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు.