తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందజేత

తల్లిదండ్రులు లేని ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందజేత

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆరో వార్డుకు చెందిన శనిగరపు మౌనిక వివాహానికి శనివారం సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి 5వేల ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నాడు. మౌనిక తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అనాధగా మిగిలి పోవడంతో మౌనికను తన అమ్మమ్మ అక్కున చేర్చుకొని చదివించింది. మేనమామలు విశ్వనాథం,గోపీలు కలిసి మౌనిక వివాహం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన బాబు అనే వ్యక్తితో  ఈనెల 12న సోమవారం నాడు జరుపుతున్నాడు.