తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన వల్లనే రాజన్న సిరిసిల్ల జిల్లాకి మెడికల్ కాలేజీ:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన వల్లనే రాజన్న సిరిసిల్ల జిల్లాకి మెడికల్ కాలేజీ:

బిజెపి నాయకుల అసత్య ఆరోపణలకు ప్రజలే బుద్ది చెప్తారు: బిఆర్ ఎస్ జిల్లా అధక్షుడు తోట ఆగయ్య

ముద్ర సిరిసిల్ల టౌన్; రాజన్న సిరిసిల్ల జిల్లాకి కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ మంజూరి చేసింది అని, మెడికల్ కాలేజీ ప్రతిపాదనను బండి సంజయ్ కేంద్రానికి పంపించారని బిజెపి పార్టీ నాయకులూ అసత్య ఆరోపణలు చేస్తూ బిజెపి పార్టీ నాయకుల ఫోటోలకు పాలాభిషేకం చేయడం సిగ్గు చేటు అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం లో తోట ఆగయ్య మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జీ.ఓ.ఎం.ఎస్-92 ద్వారా 06.08.2022 తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా తో పాటు ఇతర జిల్లాలకు మెడికల్ కాలేజీ ల కొరకు ప్రతిపాదనను నేషనల్ మెడికల్ కమిషన్ కి పంపగా, తేదీ 02.04.2023 రోజున ఎన్.ఎం.సి  నుండి అనుమతి వచ్చింది అన్నారు. ఇతర జిల్లాలతో పటు మన జిల్లా కి కూడా మెడికల్ కాలేజీ మంజూరి చేయాలనీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే స్పందించి మెడికల్ కాలేజీ మంజూరి కి కృషి చేశారని చెప్పారు. మెడికల్ కాలేజీ కి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ, డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్మాణాలు కూడా జరిగాయని గుర్తు చేశారు. బిజెపి నాయకులు కళ్ళ ముందు జరిగే అభివృద్ధి ని ఓర్వలేకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తాము చేయని పనులని తామే చేశాం అని చెప్పుకునే బిజెపి నాయకులారా మీకు ప్రజలు తప్పకుండ బుద్ది చెప్తారు అని అన్నారు. ఈ సమావేశం లో  టిఎస్పిటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, జిల్లా గ్రంధాలయ శాఖ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నరసయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లు రెడ్యా నాయక్, అన్నారం శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దార్ల సందీప్ పాల్గొన్నారు.