కేసీఆర్ పథకాలకు తూట్లు పొడవడమే కాంగ్రెస్, బీజేపీ లక్ష్యం...

కేసీఆర్ పథకాలకు తూట్లు పొడవడమే కాంగ్రెస్, బీజేపీ లక్ష్యం...

ముద్ర, మల్యాల: రైతు సంక్షేమ పథకాల పట్ల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మల్యాల మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బ్లాక్ చౌరస్తా వద్ద పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. రేవంత్, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జడ్పీటీసీ రామ్మోహన్ రావు మాట్లాడుతూ... గత ప్రభుత్వాల హయాంలో జరిగిన రైతు మరణాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడా లేని విధంగా కేసీఆర్ 24 గంటల విద్యుత్ ప్రవేశపెడ్తుతున్నారని అన్నారు. అయితే 24 గంటల విద్యుత్ వల్ల రైతు ఏ సమయంలోనైన పొలంకు వెళ్లి ఉపయోగించుకునే ఉద్దేశంతోనని రేవంత్ గ్రహించకుండా 3, 5 గంటలు సరిపోతుందని అవగాహన లోపంతో మాట్లాడం సిగ్గుచేటన్నారు. 


సింగిల్ విండో అధ్యక్షుడు బోయిన్ పల్లి మధుసూదన్ రావు మాట్లాడుతూ 
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు కూడా ఈ రోజు కేసీఆర్ పథకాలకు తూట్లు పొడిచే పనిగా ముందుకు వెళ్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీనివాస్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, పోతాని రవి, ఎండీ హజార్, కొంక నర్సియ్య, జున్ను సురేందర్, కోరుట్ల రవి, తదితరులు పాల్గొన్నారు.