జోడు పదవుల గులాబి

జోడు పదవుల గులాబి
  • గులాబీ తోటలో ముసలం
  • తిరుగుబాటుకు సిద్ధపడుతున్న నాయకులు ?

ముద్ర,ఎల్లారెడ్డిపేట : జోడు పదవుల గులాబి జిల్లా అధ్యక్షుని ఇలాకలో కొనసాగుతుంది. కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. ఇలానే ఉంటే మంత్రి కేటిఆర్ కు ఇబ్బందికరంగా మారుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు . మండలంలోని  గిరి పుత్రులు తమకు తెలియకుండా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఉద్యమకారులను  సంప్రదించకుండానే మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు సిత్యా నాయక్  భార్య కు బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా చోటు కల్పించడం ఎంతవరకు సమంజసమని ముద్రతో  ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండానే డైరెక్టర్ గా  కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వెళ్ళగక్కారు.ప్రస్తుత మండల బీఆర్ఎస్ అధ్యక్షులు వరుస కృష్ణ హరి  సెస్ డైరెక్టర్ గా గెలుపొందడంతో  జోడు పదవులు కొనసాగుతున్నాయని అన్నారు.ఉద్యమకారులను మరిచిపోతున్నారని పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయని  ఒక్క పదవి కూడా దిక్కు లేదని ఉన్న వారికి ఎలా కట్టబెడుతారని ప్రశ్నిస్తున్నారు.

సీనియర్ నాయకులు అందరు కలిసి మీటింగును కూడా ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఉద్యమకారుడు సీనియర్ నాయకులు అందే సుభాష్, పులి రమేష్  ఎలాంటి పదవి లేకుండా ఖాళీగానే పార్టీ లో కొనసాగుతున్నాడు. సెస్ డైరెక్టర్ స్థానానికి, ఏఎంసీ చైర్మన్  పదవి కి పోటీపడి భంగపడ్డ నాయకులు అసంతృప్తి గలాన్ని బహిరంగంగానే చర్చించుకున్నారు.పార్టీలో సరైన గుర్తింపు లేదని కొందరు కార్యకర్తలు నాయకులు మనోవేదనకు గురవుతున్నారు. కనీసం మంత్రి కేటీఆర్ ను కల్పించడం లేదని వారి మనసులో మాట కోడై కూస్తుంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు సతమతమవుతున్నారు.