బీడీ కార్మికులకు మరియు టేకదార్ల అందరికీ జీవన భృతి  ఇవ్వాలి..

బీడీ కార్మికులకు మరియు టేకదార్ల అందరికీ జీవన భృతి  ఇవ్వాలి..

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : 2018  కామారెడ్డి బహిరంగ సభ లో సిఎం కేసిఆర్ బీడీ కార్మికులందరికీ  పెన్షన్  ఇస్తానని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని,  ఇప్పటికైనా సీఎం కేసీఆర్  బీడీ కార్మికులు మరియు టేకదార్ల అందరికీ జీవన భృతి  ఇవ్వాలని తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలువేరు కిష్టయ్య అన్నారు. గురువారం సిరిసిల్ల పట్టణములో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలువేరు కిష్టయ్య మాట్లాడుతు.. బీడీ కార్మికులకు నెలకు 26రోజులు  చేతి నిండా పని కల్పించాలి కల్పించాలనీ,తెలంగాణ లో 10 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే రెండు లక్షల మందికి మాత్రమే జీవన భృతి ఇస్తున్నారని అన్నారు.పీ ఎఫ్  ఉన్నా కార్మికులందరికీ జీవన భృతి అంది ఇవ్వాలని,  లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ  కార్యక్రమంలో బీఎమ్ఎస్ జిల్లా అధ్యక్షడు తోట ధర్మేందర్ , బీడీ కార్మిక సంఘ్ జిల్లా అద్యక్షుడు వల్లాల చంద్రమౌళి, లత, ప్రమీల,సువర్ణ రామానుజన్,బాబి,మరియు బీడీ ప్యాకర్లు, కార్మికులు పాల్గొన్నారు.