చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీపీ మరియు ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్

చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన  ఎంపీపీ మరియు ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్

ముద్ర బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ లో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులుగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్,ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి లు హాజరై రాష్ట్ర రజక సంఘం నాయకులతో కలిసి,చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని,రజక కులస్తులు ఐక్యమహిత్యంగా ఉంటే ఏదైనా సాధించగలుగుతారని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించిన రజక కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు.

అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డిలు మాట్లాడుతూ: వీరవనిత చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.రజక కులస్తులు ఐక్యమత్యంగా ఉండి, రాజకీయాల్లో ఎదగాలని సూచించారు.ముఖ్యంగా యువత చదువుపై దృష్టి పెట్టి, ఉద్యోగాల సాధనలో ముందుండాలని,రాజకీయాల్లో సైతం ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు కొత్తకొండ లక్ష్మీ మాట్లాడుతూ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజకులను గుర్తించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని,ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు.అలాగే ఇన్సూరెన్స్ కల్పించాలని,వాచర్ మేన్ ఫెడరేషన్ కొనసాగించాలని అలాగే జనగాం జిల్లాను చాకలి ఐలమ్మ జిల్లాగా మార్చాలని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు,అలాగే ట్యాంక్ బండి పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విగ్రహావిష్కరణకు స్థలం ఇచ్చినందుకు సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి-అంజన్ రావులకు అలాగే విగ్రహ దాత అయిన ముదిగంటి సురేందర్ రెడ్డిలకు,విలాసాగర్ రజక సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి-అంజన్ రావు, వైస్ ఎంపీపీ కోనుకటి నాగయ్య, సెస్ డైరెక్టర్ కొట్టేపేల్లి సుధాకర్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, కురుమ సంఘం అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచకొండ కొమురయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంచర్ల పరుశరాములు, రజక సంఘం మండల అధ్యక్షులు ర్యాగల్ల అంజయ్య, మండల ఉపాధ్యక్షులు జంగపల్లి కనకయ్య, రజక సహకార సంఘం అధ్యక్షులు ర్యాగళ్ల శేఖర్, జిల్లా అధ్యక్షులు దుబ్బాక రమేష్, రజక సంఘాల చైర్మన్ అక్క రాజు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు గంగిపల్లి ప్రేమ్ సాగర్, గౌరవ అధ్యక్షులు పైండ్ల చందు, ఉపాధ్యక్షులు తెల్లాకుల రమేష్, ప్రధాన కార్యదర్శి పైండ్లా మహేష్, సహాయ కార్యదర్శి జంగిపల్లి సంపత్, ప్రచార కార్యదర్శి గంగిపల్లి కొండయ్య,లు మహిళలు, తదితరులు పాల్గొన్నారు