మూడు కుల సంఘాలకు విలువైన స్థలాల కేటాయింపు

మూడు కుల సంఘాలకు విలువైన స్థలాల కేటాయింపు
  • ఎన్నికల నోటీఫీకేషన్కు ముందే కుల సంఘాలకు
  • సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ.24 కోట్ల విలువైన స్థలాల కేటాయింపు

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముదిరాజ్, యాదవ,మున్నురు కాపు సంఘాలకు కలెక్టరేట్ సమీపంలోనే విలువైన స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూల్కు ముందు బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ ప్రోసిడింగ్ కాఫీలు అందజేశారు. ఒక్కో సంఘానికి రెండు ఎకరాల చొప్పున సిరిసిల్ల బైపాస్ రోడ్డులో కేటాయించారు. ఇక్కడ ఒక్కో ఎకరం స్థలం విలువ రూ.4కోట్ల పైమాటే... ఎన్నికల షెడ్యూల్ ముందరే.. ఒక్కో సంఘానికి రూ.8కోట్ల విలువ చేసే స్థలాల కేటాయింపు రాజన్నసిరిసిల్ల జిల్లాలో చర్చనీయంశంగా మారింది. సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘానికి కేవలం 10 గుంటల స్థలం కేటాయిస్తామన్న బీఆర్ఎస్ నేతలు .. ఉన్నట్లుండి రూ.8 కోట్ల విలువ గల రెండు ఎకరాలు భూమి కేటాయింపు రాజకీయంగా చర్చకు దారి తీస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ఇస్తుందన్న క్రమంలోనే ఉదయం 11 గంటలకే ఈ ప్రోసిడింగ్ లు బీఆర్ఎస్ నేతలు ఆ సంఘా నేతలకు అప్పగించారు.