రాజన్న సిరిసిల్ల జిల్లా లో మినీ జాబ్ మేళా

రాజన్న సిరిసిల్ల జిల్లా లో మినీ జాబ్ మేళా

సిరిసిల్ల టౌన్, ముద్ర:రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు హైదరాబాద్ లోని ప్రముఖ ప్రవేటు కంపెనీలలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 26 వ తేదీన ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి రాజన్న సిరిసిల్ల వారి  అద్వర్యంలో బిసి స్టడీ సర్కిల్ సర్దార్ నగర్ లో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయల నుండి 20,000 ల రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో జిల్లా లోని బిసి స్టడీ సర్కిల్ సర్దార్ నగర్ సిరిసిల్ల నందు తేదీ. 26-06-2023 రోజున ఉదయం 11.00 గంటలకు జరుగు మినీ జాబ్ మేళాకు హాజరుకావాల్సిందిగా నిరుద్యోగ యువతీ యువకులను జిల్లా ఉపాధి కల్పనా అధికారి కోరారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెం. 9963357250, 9885346768 లలో సంప్రదించాలని అన్నారు.