రాష్ట్రాన్ని ఆగం జేసింది చాలక.. ఇప్పుడు దేశం వైపు చూస్తున్నరు

రాష్ట్రాన్ని ఆగం జేసింది చాలక.. ఇప్పుడు దేశం వైపు చూస్తున్నరు
  • సిరిసిల్ల ను  మాఫియాలకు అడ్డ మార్చిండు   
  • రాష్ట్రంలో దోచుకున్న పైసలతో దేశ రాజకీయాల్లోకి
  • కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి        

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రాష్ట్రాన్ని దోచుకున్నది చాలక దేశాన్ని దోచుకోవడానికి సీఎం కేసీఅర్ బయలు దేరాడని ఆరోపించిన కేకే
మంత్రి కెటిఆర్ అహంకార,అదికార మదంతో మాట్లాడుతున్నడని ఆగ్రహం మంత్రి కేటీఆర్..సిరిసిల్లను అభివృధ్ది చేసుడు కాదు మాఫియాలకు (చేనేత,ఇసుక,బతుకమ్మ చీరల మాఫియా,భూ కబ్జాల మాఫియాలకు) అడ్డాగా మార్చిండని ఆరోపించిన కేకే రాష్ట్రాన్ని కల్వకుంట్ల ప్యామిలీ దోచుకుంటే..ఇక్కడ వాళ్ళ అనుచరులు దోచుకుంటున్నరని వెల్లడి పాపయ్యపల్లే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడిన మహేందర్ రెడ్డి గ్రామంలో బారి సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళలు,గ్రామస్థులు..వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేకే

కామెంట్స్

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటిలను చూసి కేసీఅర్ కు నిద్ర పడుతలేదంటు పేర్కొన్న కేకే
హామీలను కరెక్ట్ గా అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఓ చరిత్ర ఉందంటూ ఉద్గటించిన కేకే
మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ముందుకొచ్చిన గ్రామస్థులకు దన్యవాదాలు
తెలంగాణ వస్తె బతుకులు మరుతాయని అనుకున్నాం..కానీ బార్బాత్ చేసిండు కేసీఅర్
ప్రత్యెక రాష్ట్రం కొసం 1200 మంది యువకులు చనిపోతే ఆ తల్లుల కడుపుకోతల గోడ చూసి రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ 
తన కొడుకు రాహుల్ గాందీ రాజకీయ భవిష్యత్ ను సైతం పక్కకు పెట్టీ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీది
సిరిసిల్ల లో ఇసుక, భూ,చేనేత మాఫియాలు తయారై.. సామాన్య ప్రజలను పిడించుకు తింటున్నయి 
ప్రశ్నించే వాళ్ళను అనగదొక్కే ప్రయత్నం,పోలీసుల పహారాలో మంత్రి కేటీఆర్ చేస్తున్నడు
అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న పాపానికి నెరెళ్ళ దళితులను పోలిసుల సహాయంతో ఊచకొత కోసిన వ్యక్తి కెటిఆర్
సిరిసిల్లలో అవినీతి రాజ్యమేలుతుంది.. దోచుకున్న వాడిదే దొర పాలన అన్నట్లు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో  టెక్స్ టైల్ పార్క్ వచ్చింది..అక్కడ మిగిలిన భూమిలో డబ్బా లాంటి డబుల్ బెడ్ రూం కట్టిర్రు
ఇండ్లు అయితే ఇచ్చిర్రు కానీ అక్కడికి బస్సులు రావు ,నీళ్ళు లేవు, పిల్లలకు స్కూల్స్ లేవు
రైతులకు రుణమాపీ చేస్తానని చెప్పిన కేసీఅర్ అన్నదాతలను మోసం చేసిండు 
నాలుగు సంవత్సరాల వరకు ఊరించి ఇప్పుడు ఋణమాపీ చెస్తే రైతుల పరిస్థితి ఏంటి.. నువ్వు ఇచ్చే పైసల్ మిత్తికి కూడా సరిపోవు
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షలను ఏకకాలంలో ఋణమాపీ చేస్తాం
 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేదలకు అసెండ్ భూములు ఇస్తే వాటిని సైతం అమ్మకానికి పెట్టిన ఘనత బీఆర్ఎస్ ది
జిల్లా తెచ్చింది మేము మీరు కాదు , మహిళలందరు చెప్పులు చీపురు పట్టి నీ కారు మీదికి వస్తె జిల్లా ఇచ్చినవ్
విదేశీ పర్యటన చేస్తూ ఇక్కడా సంపాదించిన సొమ్మును అక్కడ దాచిపెడుతుండు కేటీఆర్ 
కరెంట్ బిల్లులు కట్టకపోతే వైర్లు కట్ చేస్తున్నరు..
ఇక్కడ ఏం లేదు కానీ పక్క రాష్ట్రాలకు పైసల్ పంచుతుండు కేసీఅర్ 
రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలి.. ఆ తల్లి రుణం తీర్చుకోవాలి
ఈ కార్యక్రమ0 లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ,జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి,జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి ఏరెడ్డి వెంకట్ రెడ్డి,జిల్లా నాయకులు కల్లెపల్లి తిరుపతి రెడ్డి,జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వేల్పుల సాయిప్రసాద్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు, మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ మండల మహిళా అధ్యక్షురాలు హారిక రెడ్డి సరితా రెడ్డి మండల బీసీ సెల్ అధ్యక్షులు మల్లేశం యాదవ్ రైతుసేలాధ్యక్షులు పొన్నాల పరిశ్రమలు ఎస్సీ సెల్ అధ్యక్షులు  నాగరాజు నాయకులు ఆరెపల్లి బాలు శ్యామ్ చిలుక శ్రీనివాస్ గోగు తిరుపతి చందు మరియు గ్రామస్తులు రైతులు మహిళలు పాల్గొన్నారు