రైతుబాంధవుడు కేసీఆర్ కావాలా....రైతులను పీక్కుతినే రాబంధులు కావాలా

రైతుబాంధవుడు కేసీఆర్ కావాలా....రైతులను పీక్కుతినే రాబంధులు కావాలా
  • మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్
  • అభివృద్ధి చేశాను ఆశీర్వదించండి
  • రసమయన్నను ఆశీర్వదించేందుకు కదిలిన ఊరు జనం
  • అప్పుడు లేని గ్యారంటీలు ఇప్పుడెందుకు
  • జననేత రసమయన్నకు  దారిపొడవునా బతుకమ్మలతో స్వాగతం
  • జయహో రసమయన్న నినాదాలతో హోరెత్తిన సభా ప్రాంగణం
  • ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించకుంటే కంటిపరీక్షలు చేయించుకోవాలి

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల:రైతుబాంధవుడు  కేసీఆర్. కావాలా...రైతులను యాభై ఏళ్లు రాబంధుల  లెక్క పీక్కుతిన్న కాంగ్రెస్ మాయగాళ్లు కావాలా...బందిపోటు దొంగల మాటలు నమ్మి  ప్రజలు ఆగం కావొద్దని...మళ్లీ తెలంగాణను దోచుకునేందుకు కాంగ్రెస్ బందిపోటు దొంగలు వస్తున్నారని, యాభై ఏళ్ళ కాలంలో చేయలేని అభివృద్ధి, ఇప్పుడు గ్యారెంటీ  పేరుతో వారంటీ లేని హామీలు ఇస్తున్నారని...ఈ దొంగల ముఠా కాంగ్రెస్ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని గౌరవ మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ గారు అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని రామోజీపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 100 మంది బీఆర్ఎస్ లో చేరారు.

రామోజీపేట ఆడబిడ్డలు బతుకమ్మలతో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారికి ఘనస్వాగతం పలికారు. దారిపొడవున మహిళలు,ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గారు మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ బూటకపు హామీలతో అధికారం చేపట్టాలనే దురుద్దేశ్యంతో సాధ్యంకాని దొంగ హామీలు ఇస్తోందని, ప్రజలను మాయ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. యాభై ఏళ్ళ కాలంలో ఇవ్వని గ్యారంటీ హామీలు ఇప్పుడెందుకు ఇస్తున్నారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సాధ్యంకాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు అమలు చేయలేదని, తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గ్యారెంటిలేని హామీలు ఇస్తుందని విమర్శించారు. ఆరు సూత్రాల పేరుతో ప్రజలను ఆగం చేయాలని చూస్తున్నారని...ప్రజలు ఆగం.కావొద్దన్నారు.ఎన్నికలు వస్తేనే టూరిస్టులెక్క వచ్చే కవ్వంపల్లి సత్యనారాయణ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మాణం చేయడం జరిగిందని, ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి గృహాలక్ష్మి ద్వారా₹3లక్షల సాయం అందించడం జరుగుతుందని అన్నారు.దళితులకు దళితబంధు పథకం ద్వారా ₹10లక్షల సాయం అందిస్తున్నామని, బీసీ బంధు ద్వారా కులవృత్తులపై ఆధారపడిన వారికి ₹లక్ష సాయం అందిస్తున్నామన్నారు.కళ్యాణాలక్ష్మి,షాదీముబారక్ పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్ళికి ₹లక్ష 116 సాయం చేస్తున్నామని, గత ప్రభుత్వాలు ఆడబిడ్డల పెళ్లికి నయాపైసా సాయం అందించలేదన్నారు.


తెలంగాణ రాష్ట్రం రాక ముందు సాగునీళ్లు లేక వలసలు పోయిన రైతులు ,కేసీఆర్ సీఎం అయ్యాక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది ఎకరాల బీడుభూలకు సాగు నీళ్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి కూలీలు వస్తున్నారని, తెలంగాణ రైతుల బ్రతుకుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వెలుగులు నింపిందని పేర్కొన్నారు.రైతుబందు పథకం ద్వారా ఎకరాకు₹10వేల పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు, రైతుభీమా ద్వారా రైతులు ఏ కారణంతో మరణించిన కూడా ₹5లక్షల సాయం చేస్తున్నమన్నారు.అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తోందని, ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉన్నారని పేర్కొన్నారు. బూటకపు హామీలు ఇస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు మరోసారి కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని అన్నారు.గడప గడపకు కాంగ్రెస్ ఒక దొంగనాటకమని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఉన్న సంక్షేమ పథకాలలో కోత పెట్టడమేనని, కాంగ్రెస్ హయాంలో 2వందల పెన్షన్ ఇస్తే... కేసీఆర్ సీఎం అయ్యాకా ₹4016, 2016 పెన్షలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.కాంగ్రెస్ హయాంలో కరంటు కోతలతో రైతులు సాగు చేసిన పంటలు కళ్ళ ముందు ఎండిపోతుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, పంటలకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఒకప్పుడు కరువుతో పంటల సాగు లేక భూములన్నీ బీళ్లు పెట్టి రైతులు వలసలు పోయారని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వలస వస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా లక్షల ఎకరాల భీడుభూములకు సాగు నీళ్లు అందించి పచ్చటి మాగానులుగా తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొన్నారు.ఐదేళ్ళకోసారి నియోజకవర్గానికి ఎన్నికల కోసమే వచ్చే కొత్త బిచ్చగాడి మాటలు ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఉన్నాయని, అసలు కవ్వంపల్లి సత్యనారాయణ ఏ పార్టీలో ఉంటాడో గ్యారెంటీ లేదని...ఇక ప్రజలకు ఈ వారంటీలేని కవ్వంపల్లి ఏం గ్యారెంటీ ఇస్తాడని విమర్శించారు.