వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • ఉరుములు, పిడుగులతో  కురుస్తున్న వర్షాల దృష్ట్యా చెట్ల కిందకు ఎవరు కూడా వెల్లద్దు.
  • సిరిసిల్ల డిఎస్పీ ఉదయ్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఉరుములు, పిడుగులతోక కూడిన వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో చెట్ల కింద ఎవరు ఉండరాదని సిరిసిల్ల డీఎస్పీ ఉదయ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఉదయ్ రెడ్డి  మాట్లాడుతూ..,వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు వెళ్లవద్దు అని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని అన్నారు.సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తి  స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడెందుకు వెళ్లగా వర్షం పడుతుండడంతో ఓ చెట్టు కిందకి వెళ్లి నిలబడగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.వర్షాల దృష్ట్యా వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉన్నాయీ కావున  ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు  పిల్లలు,యువత ఎవరూ చెరువుల వైపు వెళ్ళొద్దు అని అన్నారు.వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్100 సమాచారం ఇవ్వాలని కోరారు.