నూతన నియామకం..

నూతన నియామకం..

ముద్ర,రుద్రoగి:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం రుద్రంగీ మండల కేంద్రంలో బిఎస్పీ మండల స్థాయి సమీక్ష సమావేశం మండల ఇంఛార్జి కట్కురి శంకర్ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి అంకని భాను, జిల్లా ఇంఛార్జి బట్టు రామచంద్రం,మ్యకల మునిందర్, జిల్లా అధ్యక్షులు వర్డవెల్లి స్వామి గౌడ్ హాజరయ్యారు.. అనంతరం ఈ సమావేశంలో పోసు తిరుపతిని రుద్రంగి మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది.. ఈ సందర్భంగా పోసు తిరుపతి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి రుద్రంగీ మండల అధ్యక్షులుగా నియమించినందుకు  జిల్లా నాయకులకు, నియోజక వర్గ నాయకులకు మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.. రాష్ర్టంలో బిసి లకు 70సీట్లు కేటాయించిన పార్టీ కేవలం బహుజన సమాజ్ పార్టీ అని ఈ సందర్భంగా బిసి లు బహుజన సమాజ్ పార్టీ లో చేరి పార్టీని గుర్తించి రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ని ఆదరించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కర్త యారపు రాజ బాబు, మాజీ జిల్లా అద్యక్షులు చాకలి రమేశ్, నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి దొబ్బల నరేశ్, నియోజక వర్గ కోశాధికారి దయ్యాల ఉదయ్, చందుర్తి మండల అధ్యక్షులు పసుల రవీందర్, రుద్రంగీ మండల ప్రధాన కార్యదర్శి దేశావెని బుమేష్,మండల కోశాధికారి సుంచు అనిల్, గ్రామ శాఖ అధ్యక్షులు కాదాసు మహేందర్,నాయకులు కట్కురి రమేశ్,కాదాసు శ్రీనివాస్, లక్ష్మణ్, పోసూ లయ వర్ధన్, రాగుట్ల చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.