ముద్ర ఎఫెక్ట్ : మెక్కినవారు పైసలు ఇచ్చారు

ముద్ర ఎఫెక్ట్ : మెక్కినవారు పైసలు ఇచ్చారు
  • మెక్కినవారు పైసలు ఇచ్చారు 
  • బెదిరిస్తే పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేయండి 
  • ఎస్సై రమాకాంత్ 

ముద్ర, ఎల్లారెడ్దిపేట: ఎల్లారెడ్దిపేట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ‘మెక్కుతున్నారు పైసలు ఇస్తలేరు ’ పైసలు అడుగుతే బెదిరిస్తున్నారు. అనే శీర్షిక మొన్న ముద్ర లో కథనం వెలువడాగా వెంటనే స్పందించిన ఎస్సై రమాకాంత్  ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకున్ని పిలిచి బెదిరించిన వారి వివరాలు తెలుసుకున్నారు.అదేవిదంగా ఇక మీదట ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే పోలీస్ స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేయాలని వారి మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది అని సూచించారు.నిర్వాహకుడు మాట్లాడుతూ తమకు తాము వచ్చి ఉద్దెర పెట్టిన పైసలు తిరిగి చెల్లించి వెళ్తున్నారని ఆనందం వ్యక్తం చేశాడు.