ఎల్లారెడ్దిపేట: కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఏర్పాటు | Mudra Tv

ఎల్లారెడ్దిపేట: కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఏర్పాటు | Mudra Tv

ముద్ర, ఎల్లారెడ్దిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖను ఏర్పాటు చేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా రోoడ్ల  రాంరెడ్డి,  ఉపాధ్యక్షుడిగా లింగంపల్లి సత్యం, కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి  లు ఎన్నికయ్యారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలకు ప్రణాళిక బద్ధంగా పోరాడాలన్నారు రైతుల పక్షాన ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్ ,నాయకులు కోనేటి పోచయ్య,  వెంకట్ రెడ్డి, బాలయ్య,  సురేష్  తదితరులు పాల్గొన్నారు