అందరహిత సమాజం కోసమే కంటి వెలుగు సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి

అందరహిత సమాజం కోసమే కంటి వెలుగు సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల: అందరహిత సమాజం కోసమే ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి పేర్కొన్నారు. శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 38 వ వార్డులో చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిందం కళాచక్రపాణి మాట్లాడుతూ ఇటు రాష్ట్రం అభివృద్ధికి అటు ప్రజల ఆరోగ్యం కి అధిక ప్రాధాన్యత  ఇస్తూ  సిఎం కేసీఆర్  అన్ని రంగాల్లో  పారదర్శకమైన పాలనను సాగిస్తూ ప్రజల యొక్క కంటి సమస్యలు పరిష్కరిస్తూ అందరహిత సమాజం కోసం కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా దాదాపు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 2018లో ఈ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహించి మళ్లీ ఈనెల 18వ తేదీ నుండి రాష్ట్రంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు అన్ని  అన్నారు. అన్ని వార్డులలో ఈ కంటి వెలుగు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 18 సంవత్సరాల వయస్సు దాటిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి తగిన మందులు కంటి అద్దాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్ సభ్యులు గూడూరి భాస్కర్ , గేంట్యల శ్రీనివాస్ , వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.