పార్టీ మారి పదవులు అనుభవించడం కాదు..

పార్టీ మారి పదవులు అనుభవించడం కాదు..
  • దమ్ముంటే రాజీనామా చేసి నాపై పోటీ చెయ్..
  • కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ రావు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  పార్టీ మారి పదవులు అనుభవించడం కాదు.. దమ్ముంటే పదవులు అన్నింటికీ రాజీనామా చేసి తనపై పోటీ చేసి గెలవాలని టిపిసిసి సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణరావు సవాల్ విసిరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 


ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి, బిఆర్ఎస్ పార్టీకి మారి, భార్య, భర్తలు ఇద్దరు పదవులు అనుభవిస్తున్నారని అన్నారు. వెంటనే ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేసి స్థానిక అంబెడ్కర్ సెంటర్ లో చర్చకు రావాలని.... తాను కూడా చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోటీ చేయమని సవాలు విసరడం కాదు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలిచి చూపెట్టాలని,తనపై పోటీ చేసి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.  ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు. అయిత ప్రకాష్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.