పుట్ట మధు విమర్శిస్తే సహించేది లేదు - చల్ల తిరుపతిరెడ్డి

పుట్ట మధు విమర్శిస్తే సహించేది లేదు  - చల్ల తిరుపతిరెడ్డి

మహాదేవపూర్, ముద్ర: పూటకో పార్టీ చొప్పున పార్టీని మార్చిన పుట్ట మధు విమర్శించే హక్కు లేదని తనని విమర్శించే హక్కు లేదని సింగిల్ విండో చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి అన్నారు. బెగులూరు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఎంపీపీ పదవి ఇస్తానని చెప్పి 80 లక్షలు తన దగ్గర పెట్టుకొని చల్ల నారాయణరెడ్డి, పుట్ట మధు మోసానికి పాల్పడ్డారన్నారు. గత్యంతరం లేకనే బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన నేను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని పేర్కొన్నారు. ఒకే నెలలో మూడు పార్టీలు మార్చిన పుట్ట మధు తనను విమర్శిస్తే సహించేది లేదని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో అనేక ఇబ్బందులకు గురి చేశారని, పిట్టలదొర కేసీఆర్ వైఖరి, పుట్ట మధు వ్యవహారం నచ్చకనే పార్టీ మారినట్లు వివరించారు. నచ్చని పార్టీ నుండి బరాబర్ వెళ్ళిపోతామని, వాక్ స్వాతంత్రం, రాజకీయ స్వాతంత్రం దేశంలో ఉన్నాయని గుర్తు చేశారు. తాను శ్రీధర్ బాబును పరుష పదజాలంతో విమర్శించలేదని చల్ల తిరుపతి పేర్కొన్నారు. పుట్ట మధు శ్రీధర్ బాబు వివాహంలో డాన్సులు చేసిన వీడియోలు కూడా ఉన్నాయని, పుట్ట మధు సంబంధించిన అనేక విషయాలు ఆధారాలతో ఉన్నాయని అన్నారు. మాటలకు చేతలకు పొంతన లేని కేసీఆర్, పోలీస్ స్టేషన్లో తగవులు పెట్టించి పోలీసులతో రాజకీయం చేద్దామనుకునే పుట్ట మధు ప్రజలకు ఒరగబెట్టేది ఏమీ లేదన్నారు. శ్రీధర్ బాబుకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.