బిఆర్ఎస్ పార్టీ సంబరాలు

బిఆర్ఎస్ పార్టీ సంబరాలు

మహాదేవపూర్, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ప్రకటించిన మేనిఫెస్టో పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజక వర్గం ఇంఛార్జి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్కు రాబోయే ఎన్నికలలో విజయము కలగాలని ఆకాంక్షిస్తూ భూపాల్ పల్లి జడ్పీ చైర్మన్ జక్కు శ్రీ హర్షిని సూచన మేరకు మహాదేవపూర్ మండల కేంద్రములో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ  ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.