రైతు బందవుడు కేసీఆర్

రైతు బందవుడు కేసీఆర్
  • దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం 
  • రైతు బంధు జిల్లా కోఆర్డీనేటర్ హింగె మహేందర్ జి....

ముద్ర న్యూస్ రేగొండ:-రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల 15 రోజుల్లో 19 వేల కోట్లు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని  ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశించిన నేపథ్యంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ ఛైర్పర్సన్ గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు రేగొండ మండల రైతు వేదికలో రైతు బంధు జిల్లా కోఆర్డీనేటర్ హింగె మహేందర్ జి* అధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులతో మరియు ప్రజా ప్రతినిధులతో ,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి  ముఖ్యమంత్రి కేసీఆర్  చిత్రపటానికి పాలభిషేకం చేసారు.అనంతరం పలువురు రైతులకు  శాలువాతో సన్మానం చేశారు.

  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి  అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్  నిర్ణయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.ఇప్పటికే 17 వేల 351 కోట్ల రుణాలు మాఫీ చేయగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 29.61 లక్షల రైతుల కుటుంబాలకు 19 వేల కోట్ల రుణాలు మాఫీ నేలన్నర లోగా పూర్తి చేయాలని చెప్పడం గర్వించదగ్గ విషయమని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రని అన్నారు.. ఇప్పటివరకు వర్ధన్నపేట నియోజకవర్గంలో 33,579 మంది రైతులకు 150 కోట్ల రుణమాఫీ జరిగిందని గుర్తు చేశారు ,రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా తీసుకొచ్చి వారికి వెన్నుదండుగా ముఖ్యమంత్రి  నిలబడుతున్నారని అన్నారు.ఆరు నూరైనా రైతన్న సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించేది కేవలం ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రాబోయే రోజుల్లో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో PACS వైస్ చైర్మన్ సామాల పాపిరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ రహీమ్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణ రెడ్డి, బుగులోని జాతర ఛైర్మన్ కొడరి జనార్దన్ ,సర్పంచ్ లు నరేష్, వెంకన్న, సుధాకర్, కోటంచ మాజీ చైర్మన్ రాజేశ్వర్ రావు, యూత్ అధ్యక్షుడు పెర్వల ప్రశాంత్, జూబ్లీనగర్ ఎంపీటీసీ వెంకన్న,ఎంపీటీసీ ఐలు శ్రీధర్,గ్రామ రైతు కో అర్డినేటర్ సొమిడి మోహన్ రావు, గ్రామ అద్యక్షులు ముద్దమల్ల సమ్మయ్య, మహేందర్, మరిగిద్దే మోహన్ రావు, నాయకులు క్యతo రాజేష్, బోల్లారపు రాజు, sc సెల్ ప్రెసిడెంట్ అంజి, బీసీ సెల్ మండల అద్యక్షులు బండి రమేష్ గౌడ్, రైతులు పోషాలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.