దారులన్నీ బంద్

దారులన్నీ బంద్
  • వర్షానికి తెగిన రోడ్లు 
  • నిత్యావసర సరుకుల కు ఇబ్బంది పడుతున్నా ప్రజలు

ముద్ర న్యూస్ రేగొండ:-వరుణుడి ఆగ్రహంతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గ్రామాల్లో రహదారులు బంద్ అయ్యాయి.ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్లలేని పరిస్థితి.రేగొండ మండలంలోని కొనరావు పేట,కొత్తపల్లి,వెంకటేశ్వర్ల పల్లి.సుల్తాన్ పూర్,కోటంచ నుండి పోనగాండ్ల వరకు చెన్నపూర్ నుండి చిన్న కోడెపక, వరకు దారులన్నీ బారి వర్షాలకు పూర్తిగా కొట్టుకు పోయాయి.చెన్నపూర్ గ్రామానికి చెందిన రైతుల భూములు చిన్నకోడెపక శివారు ప్రాంతాల్లో ఉండటం వల్ల రైతులు వ్యవసాయనికి వెళ్లే వీలు లేకుండా పోయింది.

సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన భూములు కొనరావు పేట చెరువు కింద ఉండటం వల్ల ఆ రైతులు కూడా వెళ్ల లేని దుస్థితి .కోటంచ గ్రామానికి చెందిన పొలాలు పోనగండ్ల గ్రామ శివారులో ఉంటాయి అక్కడికి కూడా వెల్ దారులన్నీ కొట్టుకు పోయాయి.ఇప్పుడిప్పుడే వానలు తగ్గు మొఖం పట్టడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యారు.కని వ్యవసాయ భూముల వద్దకు వెళ్లలేని దుస్థితి .ట్రాక్టర్ .నాగలి. గోర్రు. ఇలా ఎలాంటి పని ముట్లు తీసుకుపోని పరిస్థితి లో రైతన్నలు ఉన్నారు.వర్షాలు తగ్గు ముఖం పట్టి నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు...కనీసం నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి వెళ్లలేని స్థితిలో ఉన్న గ్రామస్తులు.