యెర్రెట్టల గుట్ట నుండి సడాలమ్మ ఆగమనం

యెర్రెట్టల గుట్ట నుండి సడాలమ్మ ఆగమనం
  • చల్వాయి నుండి లక్ష్మీ దేవర రాక..
  • నేడు వనం నుండి జనంలోకి  శ్రీనాగులమ్మ..
  • నేడు శ్రీనాగులమ్మ పగిడిద్దరాజుల కళ్యాణం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:  ములుగు జిల్లా మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీ నర్సాపురంలో జరుగుతున్న  శ్రీ నాగులమ్మ  జాతరలో భాగంగా రెండవ రోజైన బుధవారం యెర్రెట్టల గుట్ట నుండి సడాలమ్మ  అమ్మవారిని, చల్వాయి నుండి లక్ష్మీ దేవర అమ్మవారిని తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన లక్ష్మీ దేవర ను లక్ష్మీదేవర పూజారులు బొనతల సాగర్, నాయుడు, పోచాలు తదితరులు శ్రీ నాగులమ్మ ఆలయానికి డోలు వాయిద్యాల నడుమ తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం యెర్రెట్టల గుట్ట వద్ద సడాలమ్మకు పూజారులు, వడ్డెలు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ మేనేజింగ్ ట్రస్ట్రీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ ( దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగరమేష్, సడాలమ్మ పూజారి కొమరం ధనలక్ష్మి, బాడిశ నవీన్ తదితరుల పర్యవేక్షణలో శ్రీనాగులమ్మ ఆలయానికి సమీపంలో గల కన్నాయిగూడెం వద్ద శ్రీ నాగులమ్మ కు చెందిన అడారాల ( జెండాల ) తో ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం అడారాల ( జెండాల ) ను ఆలయ ప్రాంగణంలోని సడాలమ్మ గద్దెలపై ప్రతిష్టించారు.  ఆలయ ప్రాంగణంలో మహిళలు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ ట్రస్ట్రీ, ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామీజీ ( దేవర బాల ), ఆలయ పూజారి బాడిశ నాగ రమేష్, సడాలమ్మ పూజారి కొమరం ధనలక్ష్మి, పూజారులు బాడిశ నవీన్, కొమరం పాపారావు, ఇర్ప నాగ లక్ష్మి, వడ్డెలు సోడి సత్యం, కుర్సం పుల్లయ్య,ఈసం సమ్మక్క, కట్టం సమ్మక్క, ముయబోయిన శివ, కుర్సం నరేష్, కారం రాజేష్, సోడి శివ నాగేశ్వరి, చౌలం భవాని, కుర్సం హేమలత, కారం రమాదేవి, మడకం సుప్రజ, పేరాంటాళ్ళు కుర్సం సీతక్క, కొర్స సమ్మక్క , కారం సుభలక్ష్మి , కుల పెద్దలు కుర్సం విష్ణుమూర్తి, కొమరం మాధవ రావు, కోర్స నర్సింగ రావు, మడకం రాజేశ్వర్ రావు, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.