వెళ్ళిపోకే రాములా లవ్ ఫెయిల్ సాంగ్ షూటింగ్ ప్రారంభం..

వెళ్ళిపోకే రాములా లవ్ ఫెయిల్ సాంగ్ షూటింగ్ ప్రారంభం..

ముద్ర, గంభీరావుపేట: అర్జున్,వన్య అగర్వాల్ ప్రధాన పాత్రల్లో  ఎం6 ట్యూన్స్ ఆధ్వర్యంలో మున్నా దర్శకత్వంలో  మినుకుల మోహన్  నిర్మిస్తున్న బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్ సాంగ్ షూటింగ్  ప్రారంభోత్సవం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో జరిగింది.ముహూర్తపు సన్నివేశానికి సర్పంచ్ శెట్టి మహేశ్వరి రవి,  ఆలయ చైర్మన్ మణిదీప్ రెడ్డి క్లాప్ ను ఇవ్వడంతో  సాంగ్ షూటింగ్ లాంఛనంగా  ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో డిపిఓ  జనతా బబ్లు, కో డైరెక్టర్ గణేష్, ఆలయ అర్చకులు అజయ్ శర్మ,  వైస్ చైర్మన్ వెంకటేష్, అనబత్తుల సంపత్, డ్రోన్ రఘు, మేకింగ్ ప్రీతీమ్ సందీప్,వరస్మిత, నీలిమ, రాణి, విజయలక్ష్మి,కత్తి కనకయ్య, నాగన్న పాల్గొన్నారు.