కాంగ్రెస్ పార్టీలో చేరిన గుండారం మహిళలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన గుండారం మహిళలు
  • 6 గ్యారెంటీ కార్డులను మహిళలచే ఆవిష్కరింపజేశారు.
  • కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో

   

 ముద్ర, ఎల్లారెడ్డిపేట :ఎల్లారెడ్డిపేట మండలంలోని గుండారం గ్రామంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళలకు కండువాలు కప్పి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 6 రకాల పథకాల గ్యారెంటీ కార్డులను మహిళలతో ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల పథకాలను తీసుకురావడం జరుగుతుందన్నారు. గృహ లక్ష్మీ పథకం కింద ప్రతి మహిళకు 2500 ఇవ్వడం జరుగుతుందన్నారు. అదే మాదిరిగా మహిళలపై వంట గ్యాస్ భారం తగ్గించేందుకు 5 వందలకే సిలిండర్ ఇస్తామన్నారు. ప్రస్తుతం మహిళలు తీసుకుంటున్న పెన్షన్లను 4వేల కు పెంచడం జరుగుతుందని ఇంటిలో భార్యాభర్తలు అర్హులు ఉంటే వారికి కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళల పేరుతో ఐదు లక్షల తో గృహ నిర్మాణం చేసుకోవచ్చని ఎస్సీ,ఎస్టీ మహిళలకు అదనంగా లక్ష ఇస్తామన్నారు. ముఖ్యంగా బస్సు ప్రయాణంలో మహిళలను ఉచితంగానే వారిని గమ్యస్థానాలకు చేర్చుతామన్నారు. అభయ హస్తం పెన్షన్లను కూడా పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. మహిళా బిల్లును కూడా ఇదే 2023-24ఎన్నికలకు వర్తింపజేయాలని మా నాయకురాలు సోనియా గాంధీ పార్లమెంటులో చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సూడిద రాజేందర్,  బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్,  నాయకులు వంగ మల్లారెడ్డి, దండు శ్రీనివాస్ ,గంగయ్య, చెన్ని బాబు, బిపేట రాజు, కొత్తపల్లి దేవయ్య, ఎండి హిమాం, నేలపల్లి శ్రీనివాస్,  జజ్జరిశ్రీనివాస్,  మల్లయ్య,నారాయణ తదితరులు పాల్గొన్నారు.